Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Saturday, May 03, 2008

477.marigi vIrepO mAdaivaMbulu - మరిగి వీరెపో మాదైవంబులు

Audio download link : Priyasisters

to listen :

ప|| మరిగి వీరెపో మాదైవంబులు | కెరలిన హరిసంకీర్తనపరులు ||
చ|| వినియెడివీనులు విష్ణుకథలకే | పనిగొందురు మాప్రపన్నులు |
కనియెడి కన్నులు కమలాక్షునియం- | దనువుపరతు రటు హరిసేవకులు ||
చ|| పలికెడి పలుకులు పరమాత్మునికై | యలవరుతురు శరణాగతులు |
తలచేటి తలపులు ధరణీధరుపై | తలచెడి రతిదివ్యులు ||
చ|| కరముల శ్రీపతికైంకర్యములే | మురియుచు జేతురు ముముక్షువులు |
యిరవుగ శ్రీవేంకటేశ్వరుమతమే | సిరుల నమ్ముదురు శ్రీవైష్ణవులు ||


pa|| marigi vIrepO mAdaivaMbulu | keralina harisaMkIrtanaparulu ||
ca|| viniyeDivInulu viShNukathalakE | panigoMduru mAprapannulu |
kaniyeDi kannulu kamalAkShuniyaM- | danuvuparatu raTu harisEvakulu ||
ca|| palikeDi palukulu paramAtmunikai | yalavaruturu SaraNAgatulu |
talacETi talapulu dharaNIdharupai | talaceDi ratidivyulu ||
ca|| karamula SrIpatikaiMkaryamulE | muriyucu jEturu mumukShuvulu |
yiravuga SrIvEMkaTESvarumatamE | sirula nammuduru SrIvaiShNavulu ||

Friday, May 02, 2008

476.ANikADavaTa yaMtaTiki - ఆణికాడవట యంతటికి

Audio download link : Balakrishnaprasad
Link to play in window: you need quictime

raga : durga (?) tuned by Nedunuri Krishnamurty (?)
ఆణికాడవట యంతటికి
జాణవు తెలియము సరిగొనవయ్యా

ముంగిట చెమటల ముత్యపు పూసలు
అంగన లోలో నమ్మీనదె
ఇంగితంపువెల లెరుగుదువటవో
యంగడి బేహారి యవి గొనవయ్యా

మొల్లమి మాచెలిమోవిమాణికము
అల్లవెలకు నీ కమ్మీనదె
తొల్లి నీవు సూదులవాట్లచే
కొల్ల లడిగితట కొనవయ్యా

నిడుదల చూపుల నీలంబులు నీ-
వడిగినంతకే యమ్మీనదే
పడతిదె శ్రీవేంకటపతి నీ వదె
యెడయని కాగిట నిటు గొనవయ్యా


ANikADavaTa yaMtaTiki
jANavu teliyamu sarigonavayyA

muMgiTa chemaTala mutyapu pUsalu
aMgana lOlO nammInade
iMgitaMpuvela leruguduvaTavO
yaMgaDi bEhAri yavi gonavayyA

mollami mAchelimOvimANikamu
allavelaku nI kammInade
tolli nIvu sUdulavATlachE
kolla laDigitaTa konavayyA

niDudala chUpula nIlaMbulu nI-
vaDiginaMtakE yammInadE
paDatide SrIvEMkaTapati nI vade
yeDayani kAgiTa niTu gonavayyA


Wednesday, April 30, 2008

475.eMchi sEyu panulika lEvu - ఎంచి సేయు పనులిక లేవు

Audio download link : NC Sridevi
ఎంచి సేయు పనులిక లేవు
కొంచక యాతని కొలుచుటే కలది

తప్పదు కర్మము తానెందున్నా
చెప్పగ దీనికి చింతేలా
అప్పడు తొల్లే అనుమతించె నివి
తప్పక యాతని తలచుటే కలది

ఆయము నన్నమునందొక లంకె
వేయుట దీనికి వెతలేలా
కాయములో హరి గలడంతరాత్మ
యీయెడ తను నుతియించుటే కలది

వెలిని లోన శ్రీవేంకటేశుడే
తెలియని మతి సందియమేలా
యిలలో మనముల నేలె నాతడే
సలిగె మనకతని శరణమే కలది


eMchi sEyu panulika lEvu
koMchaka yAtani koluchuTE kaladi

tappadu karmamu tAneMdunnA
cheppaga dIniki chiMtElA
appaDu tollE anumatiMche nivi
tappaka yAtani talachuTE kaladi

Ayamu nannamunaMdoka laMke
vEyuTa dIniki vetalElA
kAyamulO hari galaDaMtarAtma
yIyeDa tanu nutiyiMchuTE kaladi

velini lOna SrIvEMkaTESuDE
teliyani mati saMdiyamElA
yilalO manamula nEle nAtaDE
salige manakatani SaraNamE kaladi

474.chittagiMchumide cheliya - చిత్తగించుమిదె చెలియ వికాసము

Audio download link : NC Sridevi
Ragam : Abhogi, composer : G.Balakrishnaprasad
చిత్తగించుమిదె చెలియ వికాసము
పొత్తులు గలపీ భోగంబులకు

వెన్నెలరేకులు వెదచల్లీనిదె
సన్నల సెలవుల సకియా
కన్నులమొక్కులు కానుకలొసగీ
నిన్నుజూచి యిదె నివ్వెరగులను

జక్కవపిట్టల సంతము సేసీ
అక్కున గప్పుచు నతివా
చక్కని మోవిని చవులటు గొలిపీ
నెక్కొని నీపై నేస్తంబులను

పలుకుతేనియలు పలుమరుజిలికీ
మెలుపురతుల నలమేల్మంగ
యెలమిని శ్రీవేంకటేశ గూడితివి
అలరీ నీతో నదె సరసములా

chittagiMchumide cheliya vikAsamu
pottulu galapI bhOgaMbulaku

vennelarEkulu vedachallInide
sannala selavula sakiyA
kannulamokkulu kAnukalosagI
ninnujUchi yide nivveragulanu

jakkavapiTTala saMtamu sEsI
akkuna gappuchu nativA
chakkani mOvini chavulaTu golipI
nekkoni nIpai nEstaMbulanu

palukutEniyalu palumarujilikI
melupuratula nalamElmaMga
yelamini SrIvEMkaTESa gUDitivi
alarI nItO nade sarasamulA

473.eMtaTivAralu nevvarunu hari - ఎంతటివారలు నెవ్వరును హరి

Audio download link : Nc Sridevi
ప|| ఎంతటివారలు నెవ్వరును హరి | చింతించక నిశ్చింతలు గారు ||
చ|| అతిజితేంద్రియులు ననశనవ్రతులు- | నతులతపోధనులగువారు |
చతురాననగురుస్మరణము దొరకక | తతి నూరక పుణ్యతములు గారు ||
చ|| అనఘులు శాంతులు సధ్యాత్మతతులు- | ననుపమపుణ్యులు యాజకులు |
వనజోదరు ననవరతము దలచక | వినుతిస్మౄతిని విబుధులు గారు ||
చ|| దురితవిదూరులు దుర్మతిహీనులు | నిరతానందులు నిత్యులును |
తిరువేంకటగిరిదేవుని గొలువక | పరమార్గమునకు బ్రహ్మలు గారు ||


pa|| eMtaTivAralu nevvarunu hari | chiMtiMcaka niSciMtalu gAru ||
ca|| atijitEMdriyulu nanaSanavratulu- | natulatapOdhanulaguvAru |
caturAnanagurusmaraNamu dorakaka | tati nUraka puNyatamulu gAru ||
ca|| anaGulu SAMtulu sadhyAtmatatulu- | nanupamapuNyulu yAjakulu |
vanajOdaru nanavaratamu dalacaka | vinutismRutini vibudhulu gAru ||
ca|| duritavidUrulu durmatihInulu | niratAnaMdulu nityulunu |
tiruvEMkaTagiridEvuni goluvaka | paramArgamunaku brahmalu gAru ||

472.kEvala kRshNAvatAra kESavA - కేవల కృష్ణావతార కేశవా

Audio Download link : NC Sridevi
]Ragam : Behag, composer : G.Balakrishnaprasad


కేవల కృష్ణావతార కేశవా
దేవదేవ లోకనాథ దివ్యదేహ కేశవా

కిరణార్క కోటితేజ కేశవా
హరి లక్ష్మీనాయక యాదికేశవా
గిరిరాజసుత(తా?)నుత కేశవ నమో
శరధిగంభీర శాయి జయజయ కేశవా

కేకిపించావసంత కేశవ
శ్రీకర గుణాభిరామ చెన్న కేశవ
కేక(కి) వాహనవరద కేశవ
పాకశాసనవంద్య భళిభళి కేశవా

కింకరబ్రహ్మాదిగణ కేశవ నా-
మాంకిత శ్రీవేంకటాద్రి కేశవ
కుంకుమాంకవక్ష వెలిగోట కేశవ సర్వ -
శంకాహరణ నమో జగదేక కేశవా


kEvala kRshNAvatAra kESavA
dEvadEva lOkanAtha divyadEha kESavA

kiraNArka kOTitEja kESavA
hari lakshmInAyaka yAdikESavA
girirAjasuta(tA?)nuta kESava namO
SaradhigaMbhIra SAyi jayajaya kESavA

kEkipiMchAvasaMta kESava
SrIkara guNAbhirAma chenna kESava
kEka(ki) vAhanavarada kESava
pAkaSAsanavaMdya bhaLibhaLi kESavA

kiMkarabrahmAdigaNa kESava nA-
mAMkita SrIvEMkaTAdri kESava
kuMkumAMkavaksha veligOTa kESava sarwa -
SaMkAharaNa namO jagadEka kESavA


Tuesday, April 29, 2008

471.okkokkasatinaDuma okkokka rUpu - ఒక్కొక్కసతినడుమ ఒక్కొక్క రూపు

Audio download link : NC Sridevi
ఒక్కొక్కసతినడుమ ఒక్కొక్క రూపు గైకొని
యెక్కువైతివి కృష్ణా నిన్నెట్ల నమ్మేదిరా

మాటలాడే వొకతెతో మళ్ళిచూచే వొకతెను
వోటలేక నవ్వు నవ్వేవు వొకతెతోను
కూటవై గొల్లెతలము గుంపుగూడున్నారమిదే
యేటిది నీమోహ మింక నెందని నమ్మేదిరా

కన్నుగీటె వొకతెకు కాగిలించే వొకతెను
వెన్నదిన్న మోవిచ్చేవు వేరొకతెకు
వున్నతి రాసక్రీడ లున్నార మిందరము
ఇన్నిటిలో నీవలపు యెందని నమ్మేదిరా

తమ్మవెట్టే వొకతెను తగమెచ్చే వొకతెను
సమ్మతించ జేశొకతె చన్ను లంటేవు
యెమ్మెల శ్రీవేంకటేశ ఇందరి మమ్ము గూడితి-
విమ్ముల నే నమ్మితిగాకెటుల నమ్మేదిరా


okkokkasatinaDuma okkokka rUpu gaikoni
yekkuvaitivi kRshNA ninneTla nammEdirA

mATalADE vokatetO maLLichUchE vokatenu
vOTalEka navvu navvEvu vokatetOnu
kUTavai golletalamu guMpugUDunnAramidE
yETidi nImOha miMka neMdani nammEdirA

kannugITe vokateku kAgiliMchE vokatenu
vennadinna mOvichchEvu vErokateku
vunnati rAsakrIDa lunnAra miMdaramu
inniTilO nIvalapu yeMdani nammEdirA

tammaveTTE vokatenu tagamechchE vokatenu
sammatiMcha jESokate channu laMTEvu
yemmela SrIvEMkaTESa iMdari mammu gUDiti-
vimmula nE nammitigAkeTula nammEdirA

470.AdidEvuDai aMdaripAliTi - ఆదిదేవుడై అందరిపాలిటి

Audio download link : NC Sridevi
ఆదిదేవుడై అందరిపాలిటి-
కీ దేవుడై వచ్చెనితడు

కోరిన పరమయోగుల చిత్తములలోన
యేరీతినుండెనో యీతడు
చేరవచ్చిన యాశ్ర్తితులనెల్ల బ్రోవ
యీరీతి నున్న వాడితడు

కుటిల దానవుల కోటానుకోట్ల
యెటువలె ద్రుంచెనో యీతడు
ఘటియించి యిటువంటి కారుణ్యరూపుడై
యిటువలె నున్నవాడీతడు

తక్కక బ్రహ్మాండతతులెల్ల మోచి తా
నెక్కడ నుండెనో యీతడు
దిక్కుల వెలసిన తిరువేంకటేశుడై
యిక్కడ నున్నవాడీతడు


AdidEvuDai aMdaripAliTi-
kI dEvuDai vachchenitaDu

kOrina paramayOgula chittamulalOna
yErItinuMDenO yItaDu
chEravachchina yASrtitulanella brOva
yIrIti nunna vADitaDu

kuTila dAnavula kOTAnukOTla
yeTuvale druMchenO yItaDu
ghaTiyiMchi yiTuvaMTi kAruNyarUpuDai
yiTuvale nunnavADItaDu

takkaka brahmAMDatatulella mOchi tA
nekkaDa nuMDenO yItaDu
dikkula velasina tiruvEMkaTESuDai
yikkaDa nunnavADItaDu

469.vinnaviMchi rammanenu veladi - విన్నవించి రమ్మనెను వెలది నీతో మమ్ము

Audio download link : Mangalampalli Balamuralikrishna
విన్నవించి రమ్మనెను వెలది నీతో మమ్ము
వున్నదదే సిగ్గుతో నీవద్దనే సుమ్మీ

చుక్కబొట్టు పెట్టుకొని సుదతి నీ పాదాలకు
మొక్కి యంటించెను తన ముద్రగాను
నిక్కముగ జూచుకో నీవు తనవాడవని
యిక్కువగాను పెట్టిన ఇదె గురి సుమ్మీ

కొప్పువిరులు రాలగ కొమ్మ నీతోడ పెనగి
చొప్పువేసే నీవు తన సొమ్ముగాను
ముప్పిరి నెంచుకో నిన్ను ముందే తాగైకొంటినని
చెప్పిచూపి పెట్టిన లచ్చెనలు సుమ్మీ

అలమేలుమంగ నీ యక్కుమీదనే పొద్దు
నెలకొనీ తనకదే నెలవు గాను
యెలమి శ్రీవేంకటేశ యీకె నీ మేనికి
సలిగె తో వలపుల శాసనము సుమ్మీ


vinnaviMchi rammanenu veladi nItO mammu
vunnadadE siggutO nIvaddanE summI

chukkaboTTu peTTukoni sudati nI pAdAlaku
mokki yaMTiMchenu tana mudragAnu
nikkamuga jUchukO nIvu tanavADavani
yikkuvagAnu peTTina ide guri summI

koppuvirulu rAlaga komma nItODa penagi
choppuvEsE nIvu tana sommugAnu
muppiri neMchukO ninnu muMdE tAgaikoMTinani
cheppichUpi peTTina lachchenalu summI

alamElumaMga nI yakkumIdanE poddu
nelakonI tanakadE nelavu gAnu
yelami SrIvEMkaTESa yIke nI mEniki
salige tO valapula SAsanamu summI

468.malasI jUDarO magasiMhamu - మలసీ జూడరో మగసింహము

Audio download link: SPB
ప|| మలసీ జూడరో మగసింహము | అలవి మీరిన మాయల సింహము ||
చ|| అదివో చూడరో ఆదిమ పురుషుని | పెద యౌబళముమీది పెనుసింహము |
వెదికి బ్రహ్మాదులు వేదాంతతతులు | కదిసి కానగ లేని ఘనసింహము ||
చ|| మెచ్చి మెచ్చి చూడరో మితిమీరినయట్టి | చిచ్చరకంటితోడి జిగిసింహము |
తచ్చిన వారిధిలోని తరుణిగౌగిటజేర్చి | నచ్చిన గోళ్ళ శ్రీ నరసింహము ||
చ|| బింకమున జూడరో పిరితీయక నేడు | అంకపుదనుజ సంహార సింహము |
వేంకటనగముపై వేదాచలముపై | కింకలేక వడి బెరిగిన సింహము ||


pa|| malasI jUDarO magasiMhamu | alavi mIrina mAyala siMhamu ||
ca|| adivO cUDarO Adfima puruShuni | peda yaubaLamumIdi penusiMhamu |
vediki brahmAdulu vEdAMtatatulu | kadisi kAnaga lEni GanasiMhamu ||
ca|| mecci mecci cUDarO mitimIrinayaTTi | ciccarakaMTitODi jigisiMhamu |
taccina vAridhilOni taruNigaugiTajErci | naccina gOLLa SrI narasiMhamu ||
ca|| biMkamuna jUDarO piritIyaka nEDu | aMkapudanuja saMhAra siMhamu |
vEMkaTanagamupai vEdAcalamupai | kiMkalEka vaDi berigina siMhamu ||