Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Thursday, November 09, 2006

66.AkatiVelala - ఆకటి వేళల


Audio link :SP BalaSubrahmanyam
Audio link :Priyasisters
Audio link :G.BalaKrishnaPrasad
Archive link :
ఆకటి వేళల అలపైన వేళల
తేకువ హరినామమే దిక్కు మరి లేదు

కొఱమారియున్న వేళ కులము చెడిన వేళ
చెఱవడి వొరుల చేజిక్కినవేళ
వొఱపైన హరినామమొక్కటే గతి గాక
మఱచి తప్పిననైన మఱి లేదు తెరగు

ఆపద వచ్చిన వేళ ఆరడి బడిన వేళ
పాపపు వేళల భయపడిన వేళ
వోపినంత హరినామ మొక్కటే గతి గాక
మాపు దాకా పొరలిన మరిలేదు తెరగు

సంకెల బెట్టిన వేళ చంప బిలిచిన వేళ
అంకిలిగా నప్పుల వారాగిన వేళ
వేంకటేశు నామమే విడిపించ గతినాక
మంకు బుద్ది పొరలిన మరిలేదు తెరగు

aakaTi vaeLala alapaina vaeLala
taekuva harinaamamae dikku mari laedu

ko~ramaariyunna vaeLa kulamu cheDina vaeLa
che~ravaDi vorula chaejikkinavaeLa
vo~rapaina harinaamamokkaTae gati gaaka
ma~rachi tappinanaina ma~ri laedu teragu

aapada vachchina vaeLa aaraDi baDina vaeLa
paapapu vaeLala bhayapaDina vaeLa
vOpinaMta harinaama mokkaTae gati gaaka
maapu daakaa poralina marilaedu teragu

saMkela beTTina vaeLa chaMpa bilichina vaeLa
aMkiligaa nappula vaaraagina vaeLa
vaeMkaTaeSu naamamae viDipiMcha gatinaaka
maMku buddi poralina marilaedu teragu




priya sisters:

65.Entha Matramuna Evvaru Talachina - ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన


Audio link : MS Subbalakshmi
Audio link : G.BalaKrishnaPrasad
Archive link :
Ragamalika, Composer : K.Venkataraman
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ, పిండంతేనిప్పటి అన్నట్లు

కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు

సరి మిమ్ముదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు
దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు
సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు
దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు

నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు
ల భాగీరధి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు
శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని
ఈవలనే నీ శరణనిఎదను, ఇదియే పరతత్వము నాకు


eMta maatramuna evvaru talachina, aMtamaatramae neevu
aMtaraaMtaramuleMchi chooDa, piMDaMtaenippaTi annaTlu

koluturu mimu vaishNavulu, koorimitO vishNuDani
palukuduru mimu vaedaaMtulu, parabrahmaMbanuchu
talaturu mimu Saivulu, tagina bhaktulunoo SivuDanuchu
alari pogaDuduru kaapaalikulu, aadi bhairavuDanuchu

sari mimmuduru saaktaeyulu, Sakti roopu neevanuchu
dariSanamulu mimu naanaa vidhulanu, talupula koladula bhajiMturu
sirula mimunae alpabuddi, talachinavaariki alpaMbagudavu
darimala mimunae ghanamani talachina, ghanabuddhulaku ghanuDavu

neevalana koratae laedu mari neeru koladi taamaravu
aavala bhaageeradhi dari bAvula aa jalamae oorinayaTlu
Sree vaeMkaTapati neevaitae mamu chaekoni vunna daiva(mu)mani
eevalanae nee SaraNaniedanu, idiyae paratatvamu naaku

Video , MS Subbalakshmi

Wednesday, November 08, 2006

64.Hari Nive Sarvatmakudavu - హరి నీవె సర్వాత్మకుడవు


Audio link : G.BalaKrishnaPrasad
Archive link :
హరి నీవె సర్వాత్మకుడవు
యిరవగు భావననీయగదె

చూడకమానవు చూచేటి కన్నులు
ఏడనేవైనయితరములు
నీడలనింతానీరూపములని
ఈడువదని తెలివీయగదె

పారక మానదు పాపపు మనసిది
ఈరసములతో ఎంతైనా
నీరజాక్షయిది నీమయమేయని
ఈరీతులతలపీయగదె

కలుగక మానవు కాయపు సుఖములు
ఇలలోపల గలవెన్నైనా
అలరిన శ్రీవేంకటధిప నీకే
యిలనర్పితమను ఇహమీయగదె

hari neeve sarvaatmakuDavu yiravagu bhaavananeeyagade chooDakamaanavu choochaeTi kannulu aeDanaevainayitaramulu neeDalaniMtaaneeroopamulani eeDuvadani teliveeyagade paaraka maanadu paapapu manasidi eerasamulatO eMtainaa neerajaakshayidi neemayamaeyani eereetulatalapeeyagade kalugaka maanavu kaayapu sukhamulu ilalOpala galavennainaa alarina SreevaeMkaTadhipa neekae yilanarpitamanu ihameeyagade

Tuesday, November 07, 2006

62.PalukuTenelaTalli PavaLimchenu - పలుకు దేనెల తల్లి పవళించెను


Audio link :G.BalaKrishnaPrasad
Audio link :NedunuriKrishnaMurthy
Audio link :SP Sailaja
Archive link :
పలుకు దేనెల తల్లి పవళించెను
కలికి తనముల విభుని గలసినది గాన

నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర
పగలైన దాక జెలి పవళించెను
తెగని పరిణతులతో తెల్లవారినదాక
జగదేక పతి మనసు జట్టి గొనె గాన

కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగ దరుణి
బంగారు మేడపై బవళించెను
చెంగలువ కనుగొనల సింగారములు దొలుగ
అంగజ గురునితోడ నలసినది గాన

మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై
పరవశంబున దరుణి పవళించెను
తిరు వేంకటాచలా ధిపుని కౌగిట గలసి
అరవిరై యూరుల జెమట యంటినది గాన

priya sisters

63.PasidiAkshiMtalive PaTTaRO - పసిడియక్షంతలివె పట్టరో


Audio link :G.BalaKrishnaPrasad
Audio link : P.Suseela
Archive link :
పసిడియక్షంతలివె పట్టరో వేగమె రారో
దెసల పేరంటాండ్లు దేవుని పెండ్లికిని

శ్రీవేంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి
దైవికపు పెండ్లిముహూర్తము నేడు
కావించి భేరులు మ్రోసె గరుడధ్వజంబెక్కె
దేవతలు రారో దేవుని పెండ్లికిని

కందర్ప జనకునకి కమలాదేవికి
పెండ్లిపందిలిలోపల తలంబాలు నేడు
గంధమూ విడెమిచ్చేరు కలువడాలు గట్టిరి
అందుక మునులు రారో హరి పెండ్లికిని

అదె శ్రీ వేంకటపతికి అలమేలు మంగకును
మొదలి తిరుణాళ్ళకు మ్రొక్కేము నేడు
యెదుట నేగేరు వీరెయిచ్చేరు వరములివె
కదలిరారో పరుష ఘనుల పెండ్లికిని

61.MokketiGopanganala - మొక్కేటి గోపాంగనల


Audio link : MangalampalliBalaMuraliKrishna
Archive link :
మొక్కేటి గోపాంగనల మోహనాకారము
చిక్కని నవ్వులు నవ్వీ శ్రీ వేంకటేశ్వరుడు

సత్యభామ ఉరముపై చల్లని కస్తూ రి పూత
తత్త రించె రుక్మిణి చే తామర పూవు
హత్తి న భూకాంతకు యంగపు పయ్యెద కొంగు
చిత్తగించరమ్మా వీడె శ్రీ వేంకటేశ్వరుడు

పంతపు పదారువేల బంగారు ఉంగరము
బంతినే కుట్టబడిన పసిడి తాళి
వింతగా రాధాదేవి వేసిన కలువదండ
చెంతలను వీడె అమ్మ శ్రీ వేంకటేశ్వరుడు

ఆసల తులసీదేవి అరచేతిలో అద్దము
భాసురపు నీళాదేవి పట్టుగొమ్మ
శ్రీ సతి ఎక్కిన యట్టి సింహాసనపు గద్దె
సేస పెట్టించుకొన్నాడు శ్రీవేంకటేశ్వరుడు


mokkaeTi gOpaaMganala mOhanaakaaramu
chikkani navvulu navvee Sree vaeMkaTaeSvaruDu

satyabhaama uramupai challani kastoo ri poota
tatta riMche rukmiNi chae taamara poovu
hatti na bhookaaMtaku yaMgapu payyeda koMgu
chittagiMcharammaa veeDe Sree vaeMkaTaeSvaruDu

paMtapu padaaruvaela baMgaaru uMgaramu
baMtinae kuTTabaDina pasiDi taaLi
viMtagaa raadhaadaevi vaesina kaluvadaMDa
cheMtalanu veeDe amma Sree vaeMkaTaeSvaruDu

aasala tulaseedaevi arachaetilO addamu
bhaasurapu neeLaadaevi paTTugomma
Sree sati ekkina yaTTi siMhaasanapu gadde
saesa peTTiMchukonnaaDu SreevaeMkaTaeSvaruDu

Monday, November 06, 2006

60.ChakkaniThalliki ChanguBhala - చక్కని తల్లికి చాంగుభళా



Audio link : G.BalaKrishnaPrasad
Archive link :
Ragam : pADi , composer : Rallapalli Anantakrishna Sarma
చక్కని తల్లికి చాంగుభళా
తనచక్కెర మోవికి చాంగుభళా

కులికెడి మురిపెపు కుమ్మరింపు తన
సళుపు జూపులకు చాంగుభళా
పలుకుల సొంపుల బతితో గసరెడి
చలముల యలుకకు చాంగుభళా

కిన్నెరతో పతి కెలన నిలుచు తన
చన్ను మెఱుగులకు చాంగుభళా
ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన
సన్నపు నడిమికి చాంగుభళా

జందెపు ముత్యపు సరులహారముల
చందన గంధికి చాంగుభళా
విందయి వెంకట విభుబెన చినతన
సంది దండలకు చాంగుభళా


explanation:

Friday, November 03, 2006

59.Indariki Abhayambulichchu Cheyi - ఇందరికి న భయంబులిచ్చు చేయి



Audio link :G.BalaKrishnaPrasad
Audio link :Vanijayaram
Archive link :
ఇందరికి న భయంబులిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి॥౨

వెలలేని వేదములు వెదకి తెచ్చినచేయి
చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి
కలికి యగు భూకాంత కౌగిలించినచేయి
వలనైన కొనగోళ్ళ వాది చేయి

ఇందరికి ౨తనివోక బలిచేత దానమడిగిన చేయి
ఒనరంగ భూదాన మొసగు చేయి
మొనసి జలనిధి యమ్ముమొనకు దెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి ఇందరికి ౨॥

పురసతుల మానములు పొల్లసేసినచేయి
తురగంబు బరపెడి దొడ్డచేయి
తిరువేంకటాచలాదీశుడై మోక్షంబు
-తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి॥

iMdariki na bhayaMbulichchu chaeyi
kaMduvagu maMchi baMgaaru chaeyi~2

velalaeni vaedamulu vedaki techchinachaeyi
chiluku gubbali kiMda chaerchu chaeyi
kaliki yagu bhookaaMta kaugiliMchinachaeyi
valanaina konagOLLa vaadi chaeyi

iMdariki ~2tanivOka balichaeta daanamaDigina chaeyi
onaraMga bhoodaana mosagu chaeyi
monasi jalanidhi yammumonaku dechchina chaeyi
enaya naagaelu dhariyiMchu chaeyi iMdariki ~2

purasatula maanamulu pollasaesinachaeyi
turagaMbu barapeDi doDDachaeyi
tiruvaeMkaTaachalaadeeSuDai mOkshaMbu
-teruvu praaNula kella telipeDi chaeyi

priya sisters

Thursday, November 02, 2006

58.AlameluManga Nee AbhinavaRupamu - అలమేలుమంగనీ వభినవరూపము



Audio link : Srirangamgopalaratnam
Archive link :
అలమేలుమంగనీ వభినవరూపము
జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మ

గరుడాచలాధీశు ఘనవక్షముననుండి
పరమానంద సంభిరతవై
నెరతనములు జూపి నిరంతరమునాథుని
హరుషింపగ జేసి తిగదమ్మ

శశికిరణములకు చలువలచూపులు
విశదముగా మీద వెదజల్లుచు
రసికత పెంపున కరగించి ఎప్పుడు నీ
వశముజేసుకొంటి వల్లభునోయమ్మ

రట్టడి శ్రీవేంకటరాయనికి నీవు
పట్టపురాణివై పరగుచు
వట్టిమాకులిగిరించు వలపుమాటలవిభు
జట్టిగొని వురమునసతమైతివమ్మ


alamaelumaMganee vabhinavaroopamu
jalajaakshu kannulaku chavulichchaevamma

garuDaachalaadheeSu ghanavakshamunanuMDi
paramaanaMda saMbhiratavai
neratanamulu joopi niraMtaramunaathuni
harushiMpaga jaesi tigadamma

SaSikiraNamulaku chaluvalachoopulu
viSadamugaa meeda vedajalluchu
rasikata peMpuna karagiMchi eppuDu nee
vaSamujaesukoMTi vallabhunOyamma

raTTaDi SreevaeMkaTaraayaniki neevu
paTTapuraaNivai paraguchu
vaTTimaakuligiriMchu valapumaaTalavibhu
jaTTigoni vuramunasatamaitivamma

57.Ramudu Lokabhiramudu - రాముడు లోకాభిరాముడు


Audio link : G.BalaKrishnaPrasad
Archive link :
రాముడు లోకాభిరాముడు త్రైలోక్య
ధాముడు రణరంగ భీముడు వాడే

వరుడు సీతకు, ఫలాధరుడు మహోగ్రపు
శరుడు రాక్షస సంహరుడు వాడే
స్థిరుడు సర్వగుణాకరుడు కోదండ దీక్షా
గురుడు సేవకశుభకరుడు వాడే

ధీరుడు లోకైకవీరుడు సకలా
ధారుడు భవబంధదూరుడు వాడే
శూరుడు ధర్మవిచారుడు రఘువంశ
సారుడు బ్రహ్మసాకారుడు వాడే

బలుడు యిన్నిటా రవికులుడు భావించ, ని
ర్మలుడు నిశ్చలుడవికలుడు వాడే
వెలసి శ్రీ వేంకటాద్రి నిజనగరములోన
తలకొనె పుణ్యపాదతలుడు వాడే

---------------------------
There is another version of this sung by SPB in Album:SriRaaGanamrutam
(i am not sure whether these are written by Annamacharya)
రాముడు లోకాభిరాముడు ఆముక
విజయనగరమందునున్న వాడు

చక్కదనముల వాడు, జానకీవల్లభుడు
గక్కున శబరి పూజ గైకొన్న వాడు
వెక్కసమైన పైడి విల్లమ్ముల వాడు
రక్కసుల వైరి దశరథనందనుడు

సరథి గట్టిన వాడు చాయ నల్లని వాడు
యిరవుయై సుగ్రీవాదులనేలినవాడు
సరి భరత శతృఘ్న సౌముత్రి సేవితుడు
అరిది మునులకు అభయమిచ్చిన వాడు

అట్టి కౌసల్యాత్మజుడు ,అయోధ్యాపతైన వాడు
వట్టి తారక బ్రహ్మమై ఉండేటి వాడు
గుట్టుతో వరములిచ్చె కోనేటి దండ వాడు
పట్టపు శ్రీవేంకటాద్రి పై వరగినవాడు