Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Wednesday, December 23, 2020

899. eTTu dhariMchenO yiMdAkAnu - ఎట్టు దరించెనో యిందాఁకాను

Video link : From Sri Tadepalli Patanjali's FB page

Sung by Malladi Brothers, tuned by Sri Malladi Suribabu, in Raga : Nalinakanti 

ఎట్టు దరించెనో యిందాఁకాను
దట్టమై యిప్పుడే తమకించీని    

కన్నులకలికి కాఁకలు చల్లీ
మన్నన చూపుల మగనిపయి
వెన్నెల నవ్వులు వెదలువెట్టీ
పన్నినమోహానఁ బ్రాణేశుమీఁద    

చిలుకలకొలికి చేతులు చాఁచీ
వెలయు సిగ్గుల విభునిపై
చలివేఁడివూర్పు సారెకుఁజల్లీ
కలిమి మెరసి కాంతునిమీఁద    

అలిమేలుమంగ ఆయాలు మోపీ
యెలమి శ్రీవేంకటేశునిపై
నిలువున ముద్దు నేఁడే గునిసీ
యిలఁ దనపతి యీతనిఁ గూడి    


eTTu dariMchenO yiMdaa@Mkaanu
daTTamai yippuDae tamakiMcheeni   

kannulakaliki kaa@Mkalu challee
mannana choopula maganipayi
vennela navvulu vedaluveTTee
panninamOhaana@M braaNaeSumee@Mda   

chilukalakoliki chaetulu chaa@Mchee
velayu siggula vibhunipai
chalivae@MDivoorpu saareku@Mjallee
kalimi merasi kaaMtunimee@Mda   

alimaelumaMga aayaalu mOpee
yelami SreevaeMkaTaeSunipai
niluvuna muddu nae@MDae gunisee
yila@M danapati yeetani@M gooDi   


898. dEhaMbokaTE dEhiyu nokaDE - దేహంబొకటే దేహియు నొకఁడే

Video link from Sri Tadepalli Patanjali's FB page

Tunded and Sung by Sri Malladi Suribabu in Raga Suryakanti 

దేహంబొకటే దేహియు నొకఁడే
దాహంబెంతటఁ దనియునో తలఁపు    

వినుకలి వెంట వెడలీఁ దలఁపు
కనుకలి వెంటఁ గదలీఁ దలఁపు
కొననాలుక మదిఁ గూడీఁ దలఁపు
తునిగిన యెన్నెన్ని తునకలో తలఁపు    

నయమగు చోటను నవ్వీఁ దలఁపు
భయమగు చోటను బడలీఁ దలఁపు
లయమై నిద్రల లవమౌఁ దలఁపు
క్రియ నెందరి పంగెనయో తలఁపు    

భావించిన గతిఁ బారీఁ దలఁపు
వేవేలు గతుల వెలసీఁ దలఁపు
శ్రీవేంకటపతి చిత్తము లోపల
నీవే తెలుపఁగ నినుఁగనె తలఁపు    

daehaMbokaTae daehiyu noka@MDae
daahaMbeMtaTa@M daniyunO tala@Mpu   

vinukali veMTa veDalee@M dala@Mpu
kanukali veMTa@M gadalee@M dala@Mpu
konanaaluka madi@M gooDee@M dala@Mpu
tunigina yennenni tunakalO tala@Mpu   

nayamagu chOTanu navvee@M dala@Mpu
bhayamagu chOTanu baDalee@M dala@Mpu
layamai nidrala lavamau@M dala@Mpu
kriya neMdari paMgenayO tala@Mpu   

bhaaviMchina gati@M baaree@M dala@Mpu
vaevaelu gatula velasee@M dala@Mpu
SreevaeMkaTapati chittamu lOpala
neevae telupa@Mga ninu@Mgane tala@Mpu   

897. ennaDu delisE mechcharikepuDO - ఎన్నఁడు దెలిసే మెచ్చరికెపుడో

Video link: From Sri Tadepalli Patanjali's FB page

ఎన్నఁడు దెలిసే మెచ్చరికెపుడో
ఇన్నియుఁ గన్నవె యెఱిఁగీ నెఱఁగ

నిన్నటియాఁకలి నేఁడూ నున్నది
కన్నదినంబే కడచనెను
పన్ని నిదుర మాపటికి నున్నదదె
యెన్నఁగ రాతిరి యెందో పోయ    

కాయపు సుఖములు గంపల నున్నవి
పాయమే కైవాలి పండెనదే
యీయెడ సంసార మింటనే వున్నది
చేయును నోరును చెనటై నిలిచె    

విడువని జన్మములు వెంటనే వచ్చీ
తడవేటి మోక్షము దవ్వాయ
యెడపక శ్రీవేంకటేశ నీ మఱఁగు
బడిఁ జొచ్చితి నా భారము నీది

enna@MDu delisae mechcharikepuDO
inniyu@M gannave ye~ri@Mgee ne~ra@Mga

ninnaTiyaa@Mkali nae@MDoo nunnadi
kannadinaMbae kaDachanenu
panni nidura maapaTiki nunnadade
yenna@Mga raatiri yeMdO pOya   

kaayapu sukhamulu gaMpala nunnavi
paayamae kaivaali paMDenadae
yeeyeDa saMsaara miMTanae vunnadi
chaeyunu nOrunu chenaTai niliche   

viDuvani janmamulu veMTanae vachchee
taDavaeTi mOkshamu davvaaya
yeDapaka SreevaeMkaTaeSa nee ma~ra@Mgu
baDi@M jochchiti naa bhaaramu needi



896. nIveMta nEneMta nIku nAku neMtadavvu - నీవెంత నేనెంత నీకు నాకు నెంతదవ్వు

 Video link from Archive.org :  #674 in this list

Sung by Malladi Brothers, tunded by Sri Malladi Suribabu, in Raga: Sivaranjani

నీవెంత నేనెంత నీకు నాకు నెంతదవ్వు
దైవమా సిగ్గువడక తగిలే నేఁ గాకా    

చెంది నీకు బ్రహ్మాదులు సేవలు సేయఁగాను
యిందు మా సేవలు నీకు నేడకువచ్చు
పొంది వసిష్ఠాదు లట్టే పూజలు సేయఁగాను
సందడి మాపూజలు సరకా నీకు    

సనకాదియోగులు సారె నిన్నుఁ దలఁచఁగా
యెనసి మాతలఁపు నీ కేడకెక్కును
నునుపుగా శేషాదులు నుతులు నిన్నుఁ జేయఁగా
పనివడి మా నుతులు బాఁతేయనా నీకు    

కిట్టి నారదాదులు నీకింకరులై వుండఁగాను
యిట్టె నీదాసుఁడ ననుటెంత కెంత
వొట్టి శ్రీవేంకటేశ మాకొకవుపాయము గద్దు
పట్టి నీదాసుల బంటుబంట నయ్యేనిఁకను    

neeveMta naeneMta neeku naaku neMtadavvu
daivamaa sigguvaDaka tagilae nae@M gaakaa   

cheMdi neeku brahmaadulu saevalu saeya@Mgaanu
yiMdu maa saevalu neeku naeDakuvachchu
poMdi vasishThaadu laTTae poojalu saeya@Mgaanu
saMdaDi maapoojalu sarakaa neeku   

sanakaadiyOgulu saare ninnu@M dala@Mcha@Mgaa
yenasi maatala@Mpu nee kaeDakekkunu
nunupugaa Saeshaadulu nutulu ninnu@M jaeya@Mgaa
panivaDi maa nutulu baa@Mtaeyanaa neeku   

kiTTi naaradaadulu neekiMkarulai vuMDa@Mgaanu
yiTTe needaasu@MDa nanuTeMta keMta
voTTi SreevaeMkaTaeSa maakokavupaayamu gaddu
paTTi needaasula baMTubaMTa nayyaeni@Mkanu   


Friday, December 04, 2020

895. soridi mammita dayajUtuvu gAkA - సొరిది మమ్మిట దయఁజూతువు గాకా

Youtube link: Sri G. Balakrishnaprasad  & Smt R. Bullemma

సొరిది మమ్మిట దయఁజూతువు గాకా
వెరసి మరి యెక్కడా నేమి విన్నవించే మిఁకను    -పల్లవి-


తలఁచితి నీరూపము తగిలితి నీపాదాలు
కలసితి నీదాసుల గమిలోనను
చలివాసె భవములు సడిదీరెఁ గర్మములు
యెలమి నీమహిమలు యేమి చెప్పే మిఁకను    -సొరి-


నీముద్రలు ధరించితి నీగుణాలు వొగడితి
చేముట్టి పూజించితి శ్రీయంగాలు
తామసములెల్లా నూడె తతివచ్చె సాత్వికము
గోమున మరేమి నిన్ను కొసరే మిఁకను    -సొరి-


తిరుమణి ధరించితి తీర్థపస్రాదాలు గొంటి
విరవైన నీకథలు వీనుల వింటి
పరగ శ్రీవేంకటేశ పరము నిహముఁ గంటి
అరసి యితర మేమి ఆశపడే మిఁకను    -సొరి-

 soridi mammiTa daya@Mjootuvu gaakaa
verasi mari yekkaDaa naemi vinnaviMchae mi@Mkanu    -pallavi-
tala@Mchiti neeroopamu tagiliti neepaadaalu
kalasiti needaasula gamilOnanu
chalivaase bhavamulu saDideere@M garmamulu
yelami neemahimalu yaemi cheppae mi@Mkanu    -sori-
neemudralu dhariMchiti neeguNaalu vogaDiti
chaemuTTi poojiMchiti SreeyaMgaalu
taamasamulellaa nooDe tativachche saatvikamu
gOmuna maraemi ninnu kosarae mi@Mkanu    -sori-
tirumaNi dhariMchiti teerthapasraadaalu goMTi
viravaina neekathalu veenula viMTi
paraga SreevaeMkaTaeSa paramu nihamu@M gaMTi
arasi yitara maemi aaSapaDae mi@Mkanu    -sori-

 

Thursday, December 03, 2020

894. idi kallayanarAdu - ఇది కల్లయనరాదు యిది నిశ్చయింపరాదు

Video link from FB page of Sri T. Patanjali

ఇది కల్లయనరాదు యిది నిశ్చయింపరాదు
పదిలానఁ గొలువఁగా ప్రత్యక్షమయ్యేవు ॥పల్లవి॥

యెదలో నుండుదువని యిన్ని వేదాలు చెప్పగా
వెదకి ధ్యానము సేతు వెస గనుఁగొంట లేదు
చెదర కందే మరి జీవుఁడు నున్నాఁ డందురు
పదిలముగాఁ జూతు భావించరాదు ॥ఇది॥

అంతటా నుందువని ప్రహ్లాదుఁడు చెప్పెననఁగా
చింతించి పట్టఁదలఁతు చేతికిఁ జిక్కుట లేదు
సంతత జ్ఞానాన నీ సాకారమున్నదందురు
మంతనానఁ బిల్తు నొకమాట వినఁబడదు ॥ఇది॥

రవిలో నుందువని సురలు నిన్నుఁ గొలువఁగా
తవిలి పూజించేనంటే దగ్గరి వచ్చుట లేదు
యివల శ్రీవేంకటాద్రి నిరవై నీవున్నాఁడవు
తివిరి సేవించితిమి ద్రిష్టమాయ మాకు ॥ఇది॥


idi kallayanaraadu yidi niSchayiMparaadu
padilaana@M goluva@Mgaa pratyakshamayyaevu

yedalO nuMDuduvani yinni vaedaalu cheppagaa
vedaki dhyaanamu saetu vesa ganu@MgoMTa laedu
chedara kaMdae mari jeevu@MDu nunnaa@M DaMduru
padilamugaa@M jootu bhaaviMcharaadu

aMtaTaa nuMduvani prahlaadu@MDu cheppenana@Mgaa
chiMtiMchi paTTa@Mdala@Mtu chaetiki@M jikkuTa laedu
saMtata j~naanaana nee saakaaramunnadaMduru
maMtanaana@M biltu nokamaaTa vina@MbaDadu 


ravilO nuMduvani suralu ninnu@M goluva@Mgaa
tavili poojiMchaenaMTae daggari vachchuTa laedu
yivala SreevaeMkaTaadri niravai neevunnaa@MDavu
tiviri saeviMchitimi drishTamaaya maaku

 

893. daSavidhAcharaNaM tannabhavati - దశవిధాచరణం తన్నభవతి

https://cdn.shopify.com/s/files/1/0020/8378/2726/products/7ab5eba7698169fa6c522f92b2d9f760_600x.jpg?v=1569078559

Audio/Video link: Dr K Vandana garu  

Youtube link , video by Vineet garu

 దశవిధాచరణం తన్నభవతి 

దశవిధావస్థార్థం తే తత్ర    -పల్లవి-


స్థాపయిష్యామి వేదానితి వ్యాజేన దీపితోయం మత్స్యదేహ: పురా
వ్యాపారోయ మేవం నచ తరుణ్యా రూపజలధౌ కేళిరుచయే తత్ర    -దశ-
 

ధారయిష్యామి మందరమితి వ్యాజేన చారుకచ్ఛప విధాచ. పురా
నీరసేయం తవ మనీషా ప్రియవధూ భారకుచమందరౌ భర్తుం తత్ర    -దశ-
 

భువముద్ధరిష్యామి పునరితి వ్యాజేన ధవళ కిటి వైభవం ధత్సే పురా
వ్యవహృతిరియం నచ మహామహీకుచతటే తవ దంతక్షతం దాతుం తత్ర    -దశ-
 

దనుజం హరిష్యామి తమితి వ్యాజేన ఘన నారసింహవిక్రమణం పురా
దనుజర తవ మహత్త్వం తన్నచ నఖార్జనమిందిరాయా ప్రసర్తుం తత్ర    -దశ-
 

అపరిహరిష్యామి బలిమహమితి వ్యాజేనకపటవామనరూపకలనం పురా
నిపుణ ఏవం నఖలు నియతిస్సతీషు తే కపటాచణం ఘటయితుం తత్ర    -దశ-
 

సంహరిష్యామి నృపజనమితి వ్యాజేన బహ్వరుణతోయేప్రాప్తి: పురా
సింహవిక్రమణతే స్థితిరియం నచ సతీ విహ్వలత్వం తదా వేత్తుం తత్ర    -దశ-
 

రావణం జేష్యామి రణ ఇతి వ్యాజేన భూవరత్వే తే భోగ: పురా
ఏవం నభవతి మహీసుతా విరహంసావధానేన ప్రహర్తుం తత్ర    -దశ-
 

కంసం హనిష్యా మి ఖలమితి వ్యాజేన సంసారోయమాచరిత: పురా
హింసాదూర నచ హితమిదం వ్రజవధూసంసరణలీలాం ప్రసక్తుం తత్ర    -దశ-
 

పాతయిష్యే ప్రలంబమితి వ్యాజేనజాతరోషస్య తే జననం పురా
భూతరక్షక తే ప్రభుత్వం తన్నఖలు భూతలే రేవతీం భోక్తుం తత్ర    -దశ-
 

బుద్ధో భవిష్యామి పురహృతివ్యాజేన బద్ధరోష ఇతి తేప్రాప్తి: పురా
తద్ధితం నహిఖలు తదా వధూహస్త సిద్ధ ప్రసారేణ సేవితుం తత్ర    -దశ-
 

మారయిష్యామి కలిమతమితి వ్యాజేన క్రూర కల్క్యవతారకోప: పురా
ధీర వేంకటనగాధీశ ఏవం నఖలుభీరుముర్వీంసంప్రీణయితుమత్ర    -దశ-

 

daSavidhaacharaNaM tannabhavati
daSavidhaavasthaarthaM tae tatra    -pallavi-
sthaapayishyaami vaedaaniti vyaajaena deepitOyaM matsyadaeha: puraa
vyaapaarOya maevaM nacha taruNyaa roopajaladhau kaeLiruchayae tatra    -daSa-
dhaarayishyaami maMdaramiti vyaajaena chaarukachChapa vidhaacha. puraa
neerasaeyaM tava maneeshaa priyavadhoo bhaarakuchamaMdarau bhartuM tatra    -daSa-
bhuvamuddharishyaami punariti vyaajaena dhavaLa kiTi vaibhavaM dhatsae puraa
vyavahRtiriyaM nacha mahaamaheekuchataTae tava daMtakshataM daatuM tatra    -daSa-
danujaM harishyaami tamiti vyaajaena ghana naarasiMhavikramaNaM puraa
danujara tava mahattvaM tannacha nakhaarjanamiMdiraayaa prasartuM tatra    -daSa-
apariharishyaami balimahamiti vyaajaenakapaTavaamanaroopakalanaM puraa
nipuNa aevaM nakhalu niyatissateeshu tae kapaTaachaNaM ghaTayituM tatra    -daSa-
saMharishyaami nRpajanamiti vyaajaena bahvaruNatOyaepraapti: puraa
siMhavikramaNatae sthitiriyaM nacha satee vihvalatvaM tadaa vaettuM tatra    -daSa-
raavaNaM jaeshyaami raNa iti vyaajaena bhoovaratvae tae bhOga: puraa
aevaM nabhavati maheesutaa virahaMsaavadhaanaena prahartuM tatra    -daSa-
kaMsaM hanishyaa mi khalamiti vyaajaena saMsaarOyamaacharita: puraa
hiMsaadoora nacha hitamidaM vrajavadhoosaMsaraNaleelaaM prasaktuM tatra    -daSa-
paatayishyae pralaMbamiti vyaajaenajaatarOshasya tae jananaM puraa
bhootarakshaka tae prabhutvaM tannakhalu bhootalae raevateeM bhOktuM tatra    -daSa-
buddhO bhavishyaami purahRtivyaajaena baddharOsha iti taepraapti: puraa
taddhitaM nahikhalu tadaa vadhoohasta siddha prasaaraeNa saevituM tatra    -daSa-
maarayishyaami kalimatamiti vyaajaena kroora kalkyavataarakOpa: puraa
dheera vaeMkaTanagaadheeSa aevaM nakhalubheerumurveeMsaMpreeNayitumatra    -daSa-