Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Tuesday, August 27, 2013

800.navamoortulainaTTi narasiMhamu - నవమూర్తులైనట్టి నరసింహము

Meaning by Dr.T.Patanjali
Audio archive link : Sri Sathiraju venumadhav, raga Gowla
Audio : G.Nageswaranayudu link 1 link
Audio link : From movie Intinta Annamayya

నవమూర్తులైనట్టి నరసింహము వీడె
నవమైన శ్రీ కదిరి నరసింహము

నగరిలో గద్దెమీది నరసింహము వీడె
నగుచున్న జ్వాలా నరసింహము
నగము పై యోగానంద నరసింహము వీడె
మిగుల వేదాద్రి లక్ష్మీ నరసింహము

నాటుకొన్న భార్గవూటు నరసింహము వీడె
నాటకపు మట్టెమళ్ల నరసింహము
నాటి యీ కానుగుమాని నరసింహము వీడె
మేటి వరాహపులక్ష్మీ నారసింహము

పొలసి అహోబలాన బొమ్మిరెడ్డి చెర్లలొన
నలిరేగిన ప్రహ్లాద నరసింహము
చెలగి కదిరిలోన శ్రీ వేంకటాద్రి మీద
మెలగేటి చక్కని లక్ష్మీ నారసింహము


navamoortulainaTTi narasiMhamu veeDe
navamaina Sree kadiri narasiMhamu

1.nagarilO gaddemeedi narasiMhamu veeDe
naguchunna jvaalaa narasiMhamu
nagamu pai yOgaanaMda narasiMhamu veeDe
migula vaedaadri lakshmee narasiMhamu

2.naaTukonna bhaargavooTu narasiMhamu veeDe
naaTakapu maTTemaLla narasiMhamu
naaTi yee kaanugumaani narasiMhamu veeDe
maeTi varaahapulakshmee naarasiMhamu

3.polasi ahObalaana bommireDDi cherlalona
naliraegina prahlaada narasiMhamu
chelagi kadirilOna Sree vaeMkaTaadri meeda

melagaeTi chakkani lakshmee naarasiMhamu

Monday, August 12, 2013

799.chIraliyyagadavOyi chennakESavA - చీరలియ్యగదవొయి చెన్నకేశవా

Audio : PS Ranganath 
Archive link

చీరలియ్యగదవొయి చెన్నకేశవా! చూడు  
చేరడేసికన్నుల వో చెన్నకేశవా!                  ||పల్లవి|| 


పొత్తుల మగడవై పోరచినవ్వు నవ్వేవు 
చిత్తిడిగుణములే లొ చెన్నకేశవా 
చిత్తరు పతిమలమై సిగ్గు నీ కొప్పించితి! నీ
చిత్తము నా భాగ్యము చెన్నకేశవా            ||చీర||


యెమ్మెలకు జవ్వనాన ఇంతగాగ నోమితిమి
చిమ్మవోయి నీ కరుణ చెన్నకేశవా 
కమ్మటి నవ్వేవు మాతో కడలేదు నీయాస 
చిమ్ము జెమటల వో చెన్నకేశవా                ||చీర||


గరిమ నందరి నొక్కగాడిగట్టి కూడితివి 
శిరసుపూవులురాల చెన్నకేశవా
ఇరవై శ్రీవేంకటాద్రి యిదియంటా గూడితివి
గొరబు చేతల గండికోట చెన్నకేశవా           ||చీర||(27/314)  

saamantam  
cheeraliyyagadavoyi chennakESavaa! chUDu  
chEraDEsikannula vO chennakESavaa!                  ||pallavi|| 

pottula magaDavai pOrachinavvu navvEvu 
chittiDiguNamulE lo chennakESavaa 
chittaru patimalamai siggu nee koppinchiti! nee
chittamu naa bhaagyamu chennakESavaa            ||cheera||

yemmelaku javvanaana intagaaga nOmitimi
chimmavOyi nee karuNa chennakESavaa 
kammaTi navvEvu maatO kaDalEdu neeyaasa 
chimmu jemaTala vO chennakESavaa                ||cheera||

garima nandari nokkagaaDigaTTi kUDitivi 
Sirasupuuvuluraala chennakESavaa
iravai SreeVEnkaTaadri yidiyanTaa gUDitivi
gorabu chEtala ganDikOTa chennakESavaa           ||cheera||(27/314)

Friday, August 09, 2013

798.rAmuDu lOkAbhirAmuDu udayiMchagAnu - రాముడు లోకాభిరాముడు ఉదయించగాను

YouTube link : G.Balakrishnaprasad
రాముడు లోకాభిరాముడు ఉదయించగాను
భూమిలో వాల్మీకికి పుణ్యమెల్లా దక్కెను

తటుకున మారీచుతలపైఁ బోయఁ గర్మము
కుటిల శూర్పనఖ ముక్కునఁ బండెను
పటుకున తెగె దైత్యభామల మెడతాళ్ళు
మటమాయ దైత్యులకు మరి నూరూ నిండెను

తరగె రావణు పూర్వతపములయాయుష్యము
ఖరదూషణాదులకు కాలము దీరె
గరిమ లంకకు నవగ్రహములు భేదించె
సిరుల నింద్రజిత్తాకు చినిగె నంతటను

పొరి కుంభకర్ణునికి పుట్టినదినము వచ్చె
మరలి గండము దాకె మండోదరికి
పరగె(గి) నయోధ్యకు భాగ్యములు ఫలియించె
చిరమై శ్రీవేంకటేశుచేతలెల్లా దక్కెను

rAmuDu lOkAbhirAmuDu udayiMchagAnu
bhUmilO vAlmIkiki puNyamellA dakkenu

taTukuna mArIchutalapai@M bOya@M garmamu
kuTila SUrpanakha mukkuna@M baMDenu
paTukuna tege daityabhAmala meDatALLu
maTamAya daityulaku mari nUrU niMDenu

tarage rAvaNu pUrvatapamulayAyuShyamu
kharadUshaNAdulaku kAlamu dIre
garima laMkaku navagrahamulu bhEdiMche
sirula niMdrajittAku chinige naMtaTanu

pori kuMbhakarNuniki puTTinadinamu vachche
marali gaMDamu dAke maMDOdariki
parage(gi) nayOdhyaku bhAgyamulu phaliyiMche
chiramai SrIvEMkaTESuchEtalellA dakkenu