920. okati sugnanamu - ఒకటి సుజ్ఞానము
tuned and sung by Sri Sathiraju Venumadhav in raga rajani
ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము
Sri Tallapaka Annamacharya (1408-1503) the saint composer of the 15th century is the earliest known musician of India to compose 32k songs called “sankIrtanas” in praise of Lord Venkateswara.Lord Vishnu manifested Himself as Lord Venkateswara in Tirumala Hills to protect the Dharma from decay in the Current Age (Kali Yuga). Annamacharya was born as the incarnation of Hari Nandakam(sword) to promote Dharma through his powerful Sankirtanas (devotional songs).
tuned and sung by Sri Sathiraju Venumadhav in raga rajani
ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము
Posted by Lakshmi Sujatha at 8:31 PM 0 comments
Labels: [O_Annamayya], [ఒ_అన్నమయ్య], [ఒ_ఓ_అన్నమయ్య], Adhyatmika, Raga : Ranjani, Singer : Sattiraju Venumadhav, TunedBy : Sattiraju Venumadhav
Ragam: revati ( రేవతి)
Composed and sung by : శ్రీ సత్తిరాజు వేణుమాధవ్ గారు
meaning available in this page:
॥పల్లవి॥తలఁచరో జనులు యీతని పుణ్య నామములు
సులభముననే సర్వశుభములు గలుగు
॥చ1॥హనుమంతుడు వాయుజుఁ డంజనా తనయుఁడు
వనధి లంఘన శీల వైభవుఁడు
దనుజాంతకుఁడు సంజీవనీ శైల సాధకుఁడు
ఘనుఁడు కలశాపుర హనుమంతుఁడు
॥చ2॥లంకా సాధకుఁడు లక్ష్మణ ప్రబోధకుఁడు
శంకలేని సుగ్రీవ సచివుఁడు
పొంకపు రాముని బంటు భూమిజసంతోష దూత
తెంకినే కలశాపుర దేవ హనుమంతుడు
॥చ3॥చటులార్జున సఖుఁడు జాతరూప వర్ణుఁడు
ఇటమీఁద బ్రహ్మ పట్ట మేలేటి వాఁడు
నటన శ్రీ వేంకటేశు నమ్మిన సేవకుఁడు
పటు కలశాపుర ప్రాంత హనుమంతుఁడు
-----తాళ్లపాక అన్నమాచార్య ఆధ్యాత్మ సంకీర్తన
రాగము: గౌళ,రేకు: 0383-02,సంపుటము: 4-483
pallavitala@McharO janulu yeetani puNya naamamulu
sulabhamunanae sarvaSubhamulu galugu
cha1hanumaMtuDu vaayuju@M DaMjanaa tanayu@MDu
vanadhi laMghana Seela vaibhavu@MDu
danujaaMtaku@MDu saMjeevanee Saila saadhaku@MDu
ghanu@MDu kalaSaapura hanumaMtu@MDu
cha2laMkaa saadhaku@MDu lakshmaNa prabOdhaku@MDu
SaMkalaeni sugreeva sachivu@MDu
poMkapu raamuni baMTu bhoomijasaMtOsha doota
teMkinae kalaSaapura daeva hanumaMtuDu
cha3chaTulaarjuna sakhu@MDu jaataroopa varNu@MDu
iTamee@Mda brahma paTTa maelaeTi vaa@MDu
naTana Sree vaeMkaTaeSu nammina saevaku@MDu
paTu kalaSaapura praaMta hanumaMtu@MDu
-----taaLlapaaka annamaachaarya aadhyaatma saMkeertana
raagamu: gauLa,raeku: 0383-02,saMpuTamu: 4-483
Ragam: revati ( raevati)
Composed and sung by : Sree sattiraaju vaeNumaadhav^ gaaru
Posted by Sravan Kumar DVN at 1:48 PM 0 comments
Labels: [T_Annamayya], [త_అన్నమయ్య], Deity:Anjaneya/Hanuma, Raga : Revati, TunedBy : Sattiraju Venumadhav
Tuned & composed by Sri T.P. Chakrapani , in Ragam: Bilahari
నవనారసింహ నమో నమో
భవనాశితీర యహోబలనారసింహ
సతతప్రతాపరౌద్రజ్వాలానారసింహ
వితతవీరసింహవిదారణా
అతిశయకరుణ యోగానంద నరసింహ
మతి శాంతపు కానుగుమాని నారసింహ
మరలి బీభత్సపు మట్టెమళ్ల నరసింహ
నరహరి భార్గోటి నారసింహ
పరిపూర్ణశృంగార ప్రహ్లాదనరసింహ
సిరుల నద్భుతపు లక్ష్మీనారసింహ
వదనభయానకపు వరాహనరసింహ
చెదరని వైభవాల శ్రీనరసింహ
అదన శ్రీవేంకటేశ అందు నిందు నిరవైతి
పదివేలు రూపముల బహునారసింహ
Posted by Sravan Kumar DVN at 12:29 PM 0 comments
Labels: [N_Annamayya], [న_అన్నమయ్య], Deity:Narasimha, Raga:Bilahari, Tuned by : Chakrapani
ఏమీ నెఱఁగని మమ్ము నెక్కువ సేసి
పామరుల దొడ్డఁ జేసె భాష్యకారులు
గతచన్నవేదాలు కమలజునకు నిచ్చి
అతని కరుణచేత నన్నియుఁ గని
గతిలేకపోయిన కలియుగమున వచ్చి
ప్రతిపాలించఁగలిగె భాష్యకారులు
లోకమెల్ల వెల్లిఁబోఁగా లోననే సురలఁ గాచి
ఆకుమీఁదఁ దేలిన యతని కృప
కాకరిమతములెల్ల గాలిఁబుచ్చి పర మిట్టే
పైకొనఁగఁ గరుణించె భాష్యకారులు
పంకజపుఁ జేయి చాఁచి పాదపుఁ బరమిచ్చిన-
వేంకటేశు కృపతోడ వెలయఁ దానే
తెంకినే వొడయవరై తిరుమంత్రద్వయాన
పంకమెల్లఁ బోఁ గడిగె భాష్యకారులు
Posted by Sravan Kumar DVN at 10:53 PM 0 comments
Labels: [E_Annamayya], [ఎ_ఏ_అన్నమయ్య], [ఏ_అన్నమయ్య], guru-ramanuja, Raga:Varali, Singer:MalladiBrothers, Tuned by: Malladi Suribabu
॥పల్లవి॥పరమాత్మ నిన్ను గొల్చి బ్రదికేము
విరసపు జాలిఁ జిక్కి వెతఁబడనోపము ॥చ1॥మగఁడు విడిచినా మామ విడువనియట్లు నగి నామనసు రోసినా లోకులు మానరు తగిలేరు పొగిలేరు దైన్యమే చూపేరు మొగమోటలను నేను మోసపోవనోపను ॥చ2॥పొసఁగ దేవుఁడిచ్చినా పూజరి వరమీఁడు విసిగి నే విడిచినా విడువరు లోకులు కొసరేరు ముసరేరు కోరిక దీర్చుమనేరు పసలేని పనులకు బడల నేనోపను ॥చ3॥నుడుగులు దప్పినా నోముఫల మిచ్చినట్టు కడఁగి వేఁడుకొన్నాఁ గానిమ్మనరు లోకులు తడవేరు తగిలేరు తామే శ్రీవేంకటేశ బుడిబుడి సంగాతాలఁ బొరల నేనోపను (రాగము: ముఖారి,రేకు: 0238-05,సంపుటము: 3-220) ------తాళ్లపాక అన్నమాచార్య ఆధ్యాత్మ సంకీర్తనPosted by Sravan Kumar DVN at 10:58 AM 0 comments
Labels: [P_Annamayya], [ప_అన్నమయ్య], Adhyatmika, composer : Seshulatha, singer : Seshulatha
Youtube link : Sri P Ranganath, in raga Malayamarutam
॥పల్లవి॥వట్టి లంపటము వదల నేరదు గాన
పుట్టించిన హరి బుద్దిలోనె కాఁడా ॥చ1॥దేహాభిమానములు తెగి విడిచినఁ గాని యీహల దేవుఁడు తన్ను నేల మెచ్చీనీ సాహసించి కోరికెల సంగము మానకుండితే వోహో పరమపద మూర కేల కలుగు ॥చ2॥నిచ్చలును వైరాగ్యనిష్ఠుడు గాకుండితేను యెచ్చిన జన్మాదు లెల్ల యేల కడచు కొచ్చి కొచ్చి తనలోని కోపముడుగ కుండితే అచ్చపు బ్రహ్మానంద మది యేల కలుగు ॥చ3॥శ్రీ వేంకటాద్రి మీఁది శ్రీపతిఁ గొల్వకుండితే సోవల నా దేవుఁ డిట్టె సులభుఁడవునా భావించి తనలోని భక్తి నిలుపకుండితే తావుల నన్నిటాను సంతత పుణ్యుఁ డవునా (రాగము: భూపాళం,రేకు: 0027-03,సంపుటము: 15-155) ---తాళ్లపాక పెదతిరుమలాచార్య ఆధ్యాత్మ సంకీర్తనPosted by Sravan Kumar DVN at 9:21 PM 0 comments
Labels: [V_Annamayya], [వ_అన్నమయ్య], peda tirumalacharya, Raga:MalayaMarutam, Tuned by : PS Ranganath
Tuned and sung by Sri Parupalli Ranganath
మా ఇంటికి రావోయి మాధవా మాయలెల్ల కంటిమిదె మాధవా నీ మాయలెల్ల కంటిమిదె మాధవా౹ మత్తు చల్లేవు వలపు మాధవా మచ్చికలెల్ల జేసితివి మాధవ మచ్చెము నీపై నదే మాధవా ఇంక మచ్చరపు చూపులేల మాధవ౹౹ మా ఇంటికి రావోయి మాధవా నీ మాయలెల్ల కంటిమిదె మాధవా నీ మాయలెల్ల కంటిమిదె మాధవ మరుగేల ఇక నీకు మాధవ మరి నాకు దక్కితివి మాధవ మరచేవా నీ చేతలు మాధవ మాటు మరతుమంటేమనేవు మాధవ౹౹ మా ఇంటికి రావోయి మాధవ మాయలెల్ల కంటిమిదె మాధవ నీ మాయలెల్ల కంటిమిదె మాధవ మట్టులేని శ్రీవేంకట మాధవ కట్టు మట్టుతో మము కూడితి మాధవ మట్టేవు మా కాళ్ళు పట్టి మాధవా మా మట్టె లియ్యంగదవోయి మాధవా౹౹ మా ఇంటికి రావోయి మాధవ మాయలెల్ల కంటిమిదె మాధవ నీ మాయలెల్ల కంటిమిదె మాధవ నీ మాయలెల్ల కంటిమిదె మాధవ నీ మాయలెల్ల కంటిమిదె మాధవ ౹౹
maa iMTiki raavOyi maadhavaa maayalella kaMTimide maadhavaa nee maayalella kaMTimide maadhavaa౹ mattu challaevu valapu maadhavaa machchikalella jaesitivi maadhava machchemu neepai nadae maadhavaa iMka machcharapu choopulaela maadhava౹౹ maa iMTiki raavOyi maadhavaa nee maayalella kaMTimide maadhavaa nee maayalella kaMTimide maadhava marugaela ika neeku maadhava mari naaku dakkitivi maadhava marachaevaa nee chaetalu maadhava maaTu maratumaMTaemanaevu maadhava౹౹ maa iMTiki raavOyi maadhava maayalella kaMTimide maadhava nee maayalella kaMTimide maadhava maTTulaeni SreevaeMkaTa maadhava kaTTu maTTutO mamu kooDiti maadhava maTTaevu maa kaaLLu paTTi maadhavaa maa maTTe liyyaMgadavOyi maadhavaa౹౹ maa iMTiki raavOyi maadhava maayalella kaMTimide maadhava nee maayalella kaMTimide maadhava nee maayalella kaMTimide maadhava nee maayalella kaMTimide maadhava ౹౹
Posted by Sravan Kumar DVN at 11:03 AM 0 comments
Labels: [M_Annamayya], [మ_అన్నమయ్య], Deity:Krishna, raga:kApi, Tuned by : PS Ranganath
Youtube link : Tuned and composed by Sri Malladi Suribabu , ragam bilahari
ఇంతే యింతే యింకా నెంత చూచినా
చింతలఁ జిగురులెక్కి చేఁగ దేరినట్లు
వుల్లములో నెంచనెంచ నుద్యోగములే పెక్కు
పొల్లకట్టు దంచదంచఁ బోగులైనట్టు
బల్లిదుని హరినాత్మ భావించుటొకటే
ముల్ల ముంటఁ దీసి సుఖమున నుండినట్లు
అనిన సంసారమున నలయికలే పెక్కు
చానిపిఁ జవి వేఁడితేఁ జప్పనైనట్టు
పూని హరిఁ జేతులారాఁ బూజించుటొకటే
నూనె గొలిచి కుంచము నుసికిలినట్లు
వెనకఁ దలఁచుకొంటే విజ్ఞానములే పెక్కు
తినఁ దిన వేమేల్లాఁ దీపైనట్టు
చనవై శ్రీవేంకటేశు శరణను టొక్కటే
పనివడి చెఱకునఁ బండువండినట్లు
Posted by Sravan Kumar DVN at 8:39 PM 0 comments
Labels: [I_Annamayya], [ఇ_అన్నమయ్య], [ఇ_ఈ_అన్నమయ్య], Raga:Bilahari
ragam : revati (రేవతి) composed & sung by Sri Sattiraju Venumadhav garu
॥పల్లవి॥ఊరకైతే నిన్నుఁ గాన మొకకారణానఁ గాని
పూరిజీవులము, నీవు పురుషోత్తముఁడవు ॥చ1॥అసురలు భువిఁ బుట్టుటది వుపకారమే అసురలు బాధింతు రమరులను పొసఁగ వారికిఁగాను పూనుకవచ్చి నీవు వసుధ జనించితేను వడి నిన్నుఁ గందుము ॥చ2॥అడరి ధర్మము చెడి యధర్మమైనా మేలు వెడఁగు మునులు విన్నవింతురు నీకు తడవి ధర్మము నిల్ప ధరణిఁ బుట్టుదు నీవు బడి నిన్ను సేవించి బ్రదుకుదు మపుడే ॥చ3॥నీకంటే మాకుఁ జూడ నీదాసులే మేలు పైకొని వారున్నచోటఁ బాయకుందువు చేకొని శ్రీవేంకటేశ చెప్పఁగానే వారిచేత నీకథలు విని విని నే మీడేరితిమిPosted by Sravan Kumar DVN at 10:13 AM 0 comments
Labels: [O_Annamayya], [ఊ_అన్నమయ్య], Adhyatmika, Raga : Revati, TunedBy : Sattiraju Venumadhav
శుక్రవారం అభిషేకంలో శ్రీవేంకటేశ్వరస్వామివారిి మూలమూర్తికి 84 తులాల పచ్చకర్పూరం, 36 తులాల కుంకుమపువ్వు, 1 తులం కస్తూరి, 1.5 తులం పునుగు తైలం, 24 తులాల పసుపు పోడి మున్నగు పరిమళ ద్రవ్యాలు ఉపయోగిస్తారు. వీటితో శ్రీవారికి అభిషేకం చెయ్యగా వచ్చే తీర్ధాన్ని "పులికాపుతీర్ధం (శ్రీ పాదతీర్ధం)" అంటారు. ఈ తీర్ధాన్ని అభిషేకంలో పాల్గొనే భక్తులుపై సంప్రోక్షిస్తారు. ఈ తీర్ధాన్ని శ్రీవారి భక్తులు తీర్ధంగా స్వీకరిస్తారు (TTD వారు Bottles లో వేసి అభిషేకంలో భక్తులందరికీ ఈ తీర్ధం ఇస్తారు). ఈ హరిపాద తీర్ధ మహిమను గూర్చి 'అన్నమయ్య' ఇలా కీర్తించాడు.
(taken from http://tvramudu.blogspot.com/2016_05_18_archive.html)
YouTube link : Smt YogaKirtana
శ్రీహరిపాదతీర్ధంబే చెడని మందు
మోహపాసాలు గోసి మోక్షమిచ్చే మందు
కారమై కంటగించని కడు చల్లని మందు
నూరని కాచనియట్టి నున్నని మందు
కోరికతో వెలవెట్టి కొని తేవల్లని మందు
వేరు వెల్లంకులు కూర్చనట్టి వెందువోని మందు
గురుతైన రోగములు గుణముచేసే మందు
దురితములు పెడబాపే దోడ్డ మందు
నిరతము బ్రహ్మాదులు నేరుపుతో సేవించే మందు
నరకము సొరమట్టి నయమయిన మందు
SukravaaraM abhishaekaMlO SreevaeMkaTaeSvarasvaamivaarii moolamoortiki 84 tulaala pachchakarpooraM, 36 tulaala kuMkumapuvvu, 1 tulaM kastoori, 1.5 tulaM punugu tailaM, 24 tulaala pasupu pODi munnagu parimaLa dravyaalu upayOgistaaru. veeTitO Sreevaariki abhishaekaM cheyyagaa vachchae teerdhaanni "pulikaaputeerdhaM (Sree paadateerdhaM)" aMTaaru. ee teerdhaanni abhishaekaMlO paalgonae bhaktulupai saMprOkshistaaru. ee teerdhaanni Sreevaari bhaktulu teerdhaMgaa sveekaristaaru (TTD vaaru Bottles lO vaesi abhishaekaMlO bhaktulaMdarikee ee teerdhaM istaaru). ee haripaada teerdha mahimanu goorchi 'annamayya' ilaa keertiMchaaDu.
SreeharipaadateerdhaMbae cheDani maMdu
mOhapaasaalu gOsi mOkshamichchae maMdu
kaaramai kaMTagiMchani kaDu challani maMdu
noorani kaachaniyaTTi nunnani maMdu
kOrikatO velaveTTi koni taevallani maMdu
vaeru vellaMkulu koorchanaTTi veMduvOni maMdu
gurutaina rOgamulu guNamuchaesae maMdu
duritamulu peDabaapae dODDa maMdu
niratamu brahmaadulu naeruputO saeviMchae maMdu
narakamu soramaTTi nayamayina maMdu
Posted by Sravan Kumar DVN at 11:12 AM 0 comments
Labels: [S_Annamayya], [శ_అన్నమయ్య], [స_శ_ష_అన్నమయ్య], Raga:Kharaharapriya, Singer: Yogakirtana