Tuesday, May 06, 2008

485.ahObalESvaruDu arikuladamanuDu - అహోబలేశ్వరుడు అరికులదమనుడు

Audio link : Balakrishnaprasad
ప|| అహోబలేశ్వరుడు అరికులదమనుడు | మహా మహిమలకు మలసీవాడె ||
చ|| కదలు కన్నులును కరాళవదనము | గుదిగొను భయదపు కోరలను |
అదరు మీసములు అలరగ నవ్వుచు | వుదుట తోడ కొలువున్నాడు వాడె ||
చ|| అతిసిత నఖములు అనంత భుజములు | వితత పరాక్రము వేషమును |
అతుల దీర్ఘజిహ్వయు కడు మెరయగ | మితిలేని కరుణ మెరసీ వాడు ||
చ|| సందడి సౌమ్యములు శంఖచక్రములు | పొందుగ దివిజులు పొగడగను
ఇందిర దొడపై నిడి శ్రీవేంకట- | మందు నిందు కడు అలరీ వాడే ||


pa|| ahObalESvaruDu arikuladamanuDu | mahA mahimalaku malasIvADe ||
ca|| kadalu kannulunu karALavadanamu | gudigonu Bayadapu kOralanu |
adaru mIsamulu alaraga navvucu | vuduTa tODa koluvunnADu vADe ||
ca|| atisita naKamulu anaMta Bujamulu | vitata parAkramu vEShamunu |
atula dIrGajihvayu kaDu merayaga | mitilEni karuNa merasI vADu ||
ca|| saMdaDi saumyamulu SaMKacakramulu | poMduga divijulu pogaDaganu
iMdira doDapai niDi SrIvEMkaTa- | maMdu niMdu kaDu alarI vADE ||

No comments:

Post a Comment