Monday, March 17, 2008

434.ItaDE haruDu yItaDE yajuDu - ఈతడే హరుడు యీతడే యజుడు

Audio link : Balakrishnaprasad
ఈతడే హరుడు
యీతడే యజుడు

ఈతనికి నీ చేతలెంత
ఘనమటుగాన


కడుపెక్కు బ్రహ్మాండ
కటకములు సుడివడిన

కడుపులో నిడుకొన్న ఘనుడు
వెడలి పూతకిచంటి
విషము తాగిన యంత

వడి తనకు నేమాయ వట్టిబూమెలుగాక

ఎల్లజలధులు మిగిలి యేకమై పబ్బినపు-
డుల్లసిల్లుచు నీతడుండు
మల్లాడి యొక రెండు మద్దులు విరచినట్టి
బల్లిదుడవని నిన్ను పరిణమింతురు గాన

తిరువేంకటేశ్వరుడు దేవ దేవోత్తముడు
పరిపూర్ణుడచ్యుతుడభవుడు
శరణాగతుల రక్షసేయు వాడనుమాట
గురుతుగా తలపోసి కొనియాడాగా వలసె


ItaDE haruDu yItaDE yajuDu
Itaniki nI chEtaleMta ghanamaTugAna

kaDupekku brahmAMDa kaTakamulu suDivaDina
kaDupulO niDukonna ghanuDu
veDali pUtakichaMTi vishamu tAgina yaMta
vaDi tanaku nEmAya vaTTibUmelugAka

ellajaladhulu migili yEkamai pabbinapu-
Dullasilluchu nItaDuMDu
mallADi yoka reMDu maddulu virachinaTTi
balliduDavani ninnu pariNamiMturu gAna

tiruvEMkaTESwaruDu dEva dEvOttamuDu
paripUrNuDachyutuDabhavuDu
SaraNAgatula rakshasEyu vADanumATa
gurutugA talapOsi koniyADAgA valase

No comments:

Post a Comment