Tuesday, October 10, 2006

30.Ramudu Raghavudu - రాముడు రాఘవుదు రవికులుడితడు



Archive Page
Audio link : BKP
రాముడు రాఘవుదు రవికులుడితడు
భూమిజకు పతియైన పురుష నిధానము

అరయ పుత్రకామేష్ఠి యందు పరమాన్నమున
పరగ జనించిన పరబ్రహ్మము
సురల రక్షింపగ అసురుల శిక్షింపగ
తిరమై ఉదయించిన దివ్య తేజము

చింతించు యోగీంద్రుల చిత్త సరోజములలో
సంతతము నిలిచిన సాకారము
వింతలుగా మునులెల్ల వెదకిన యట్టి
కాంతుల చెన్ను మీరిన కైవల్య పదము

వేదవేదాంతములందు విజ్ఞాన శాస్త్రములందు
పాదుకొని బలికేటి పరమార్థము
పోదితో శ్రీ వేంకటాద్రి పొంచి విజయనగరాన
ఆదికనాదియైన అర్చావతారము


raamuDu raaghavudu ravikuluDitaDu
bhoomijaku patiyaina purusha nidhaanamu

araya putrakaamaeshThi yaMdu paramaannamuna
paraga janiMchina parabrahmamu
surala rakshiMpaga asurula SikshiMpaga
tiramai udayiMchina divya taejamu

chiMtiMchu yOgeeMdrula chitta sarOjamulalO
saMtatamu nilichina saakaaramu
viMtalugaa munulella vedakina yaTTi
kaaMtula chennu meerina kaivalya padamu

vaedavaedaaMtamulaMdu vij~naana SaastramulaMdu
paadukoni balikaeTi paramaarthamu
pOditO Sree vaeMkaTaadri poMchi vijayanagaraana
aadikanaadiyaina archaavataaramu