Sunday, June 27, 2010

705.dEva nI pakshapAtamO tirigE - దేవ నీ పక్షపాతమో తిరిగే లోకుల వెల్తో

3-422
 
Audio link : in raga sindubhairavi
దేవ నీ పక్షపాతమో తిరిగే లోకుల వెల్తో శ్రీవిభుడ నీవేకాదా చిత్తములోనయ్యా దివములు సరియే దినరాత్రులును సరే యివల సుఖదుఃఖాలు హెచ్చుకుందులేలయ్యా భవములు సరియే ప్రాణములు సరియే భువి పుణ్యపాపముల భోగము వేరేలయ్యా విని కిందిరి కొకటే విషయాలు నొకరీతే మునిగేటిజాతిబేధము లివేలయ్యా అనయముఁ జూపొక్కటే ఆకలియు నొకటే పెనగేటి గుణములు పెక్కుజాడ లేలయ్యా అంతరాత్మ నీవొక్కడ వన్నిటా శ్రీవేంకటేశ చింతలు వేవేలైన సిలుగేలయ్యా యింతసేసీ నీమాయ లిందుకే నీశరణంటే కాంతుడ నన్నిందుకే కాచితివి నేడయ్యా dEva nI pakshapAtamO tirigE lOkula veltO SrIvibhuDa nIvEkAdA chittamulOnayyA divamulu sariyE dinarAtrulunu sarE yivala sukhadu@hkhAlu hechchukuMdulElayyA bhavamulu sariyE prANamulu sariyE bhuvi puNyapApamula bhOgamu vErElayyA vini kiMdiri kokaTE vishayAlu nokarItE munigETijAtibEdhamu livElayyA anayamu@M jUpokkaTE Akaliyu nokaTE penagETi guNamulu pekkujADa lElayyA
aMtarAtma nIvokkaDa vanniTA SrIvEMkaTESa chiMtalu vEvElaina silugElayyA yiMtasEsI nImAya liMdukE nISaraNaMTE kAMtuDa nanniMdukE kAchitivi nEDayyA

1 comment:

  1. అన్నమయ్య పాటల్లో ఉన్న సాంఘికప్రస్తావనలకు ఇది ఒక మచ్చుతునక. ఆయన కేవలం ఆధ్యాత్మికంగానే కాక, సమాజంలోని విషయాలను కూడా పట్టించుకున్నాడు అనడానికి ఇది మఱొక ఋజువు. చక్కని పాటను గురించి చెప్పావు సోదరా. నీకు నా ధన్యవాదములు.

    ReplyDelete