Monday, September 22, 2008

540.pAladoMgavadda vachchi - పాలదొంగవద్ద వచ్చి పాడేరు



Audio link :GBKP
Archive link :
ప పాలదొంగ వద్ద వచ్చి పాడేరు తమ-
పాలిటిదైవమని బ్రహ్మాదులు

చ రోల గట్టించుక పెద్దరోలలుగా వాపోవు
బాలునిముందర వచ్చి పాడేరు
ఆలకించి వినుమని యంబరభాగమునందు
నాలుగుదిక్కులనుండి నారదాదులు

చ నోరునిండా జొల్లుగార నూగి ధూళిమేనితో
పారేటిబిడ్డనివద్ద బాడేరు
వేరులేనివేదములు వెంటవెంట జదువుచు
జేరిచేరి యింతనంత శేషాదులు

చ ముద్దులు మోమునగార మూలలమూలలదాగె-
బద్దులబాలునువద్ద బాడేరు
అద్దివో శ్రీతిరువేంకటాద్రీశు డితడని
చద్దికి వేడికి వచ్చి సనకాదులు


pa: pAladoMga vadda vacci pADEru tama-
pAliTidaivamani brahmAdulu
ca: rOla gaTTiMcuka peddarOlalugA
vApOvu bAlunimuMdara vacci pADEru
AlakiMci vinumani yaMbaraBAgamunaMdu
nAlugudikkulanuMDi nAradAdulu
ca: nOruniMDA jollugAra nUgi dhULimEnitO

pArETibiDDanivadda bADEru
vErulEnivEdamulu veMTaveMTa jaduvucu
jEricEri yiMtanaMta SEShAdulu
ca: muddulu mOmunagAra mUlalamUlaladAge-
baddulabAlunuvadda bADEru addivO
SrItiruvEMkaTAdrISu DitaDani
caddiki vEDiki vacci sanakAdulu

1 comment:

  1. ఓ పది రోజుల తర్వాత ఈ రోజే నెట్ కనెక్షన్ రిష్టోర్ అయింది. వెంటనే పాలదొంగ వెంటవచ్చీ పాట విన్నాను.పాట బాగుంది.ధన్యవాదములు.దయచేసి word verification తీసివేయండి.

    ReplyDelete