Thursday, April 08, 2010

683.muddugAraganide muMgiTa - ముద్దుగారగనిదె ముంగిట నిలుచున్నాడు


Audio link : Singer: Ramya S , in Bhupalam (classical)
ముద్దుగారగనిదె ముంగిట నిలుచున్నాడు
వొద్దికేగి చెలులెల్ల వూరడించరే

వేకువజామున లేచి వేడుక కృష్ణుడు తల్లి
ఆకలయ్యీ ననుచు వొయ్యనె మంచము దిగి
కాకలతో పసివాడి కన్నులు పులుముకొంటా
యేకరుచు నున్నవాడు యెత్తుకోరే బిడ్డని

బాలులతో వూరనెల్ల బరువులు వెట్టి వెట్టి
చాలుకొని యాడి యాడి జామెక్కగా వచ్చి
కేలుచాచి వెన్నడిగి కిందుపడీ యంతలో
బేలులై వుండగనేల పెట్టరే బిడ్డనికి

మట్టమద్యాన్నపువేళ మలయుచు నింటిలోనే
చట్టల పెరుగు వేడీ చాలఁబెట్టరే మీరు
పట్టపు శ్రీవేంకటాద్రిపై కీలుకొనె నిదె
అట్టిట్టనక వీని నాదరించరే

Painting by Sri Raja Ravivarma
muddugAraganide muMgiTa niluchunnADu
voddikEgi chelulella vUraDiMcharE

vEkuvajAmuna lEchi vEDuka kRshNuDu talli
AkalayyI nanuchu voyyane maMchamu digi
kAkalatO pasivADi kannulu pulumukoMTA
yEkaruchu nunnavADu yettukOrE biDDani

bAlulatO vUranella baruvulu veTTi veTTi
chAlukoni yADi yADi jAmekkagA vachchi
kEluchAchi vennaDigi kiMdupaDI yaMtalO
bElulai vuMDaganEla peTTArE biDDaniki

maTTAmadyAnnapuvELa malayuchu niMTilOnE
chaTTala perugu vEDI chAla@MbeTTarE mIru
paTTapu SrIvEMkaTAdripai kIlukone nide
aTTiTTanaka vIni nAdariMcharE

2 comments:

  1. చిన్ని కృష్ణుని గురించి రాసిన ఈ కీర్తన చాలా బావుంది.

    "మట్టామద్యాన్నపువేళ": ఇది "మిట్టామద్యాన్నపువేళ" అని ఏమయినా వుండాలా? లేక మిట్ట మధ్యాన్నం అని మనం ఇప్పుడు వాడే పదానికి మట్టామద్యాన్నం అనే వాడుక కూడా వుందా?

    ReplyDelete
  2. hi harsha ,
    TTD publish chesina book lo "మట్టమద్యాన్నపువేళ" ane unnadi.
    24th book , kirtana:160
    http://www.esnips.com/doc/65bbae9e-b93e-4597-ae09-7211302ab9e8/Book24

    ee vaduka kuda undedemoo...
    -sravan

    ReplyDelete